దసరా వేడుకలు జరుపుకోలేని స్థితిలో ఉన్నామని... కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఎంతో ఉత్సాహంగా జరుపుకోవచ్చని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 48 వేల కుటుంబాలు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, గత నెల వేతనం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాజ్భవన్లో గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు