కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ కాగజ్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు జగదీష్ అనిల్ కుమార్. తన భర్త జగదీష్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య మేరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవాళ జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును సైతం కలిశారు ఎంపీడీఓ భార్య మేరీ. తన భర్త జగదీష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీష్ అనిల్ కుమార్‌కు గుంటూరుకు చెందిన మేరీ కుమారితో 2018లో వివాహమైంది. శుక్రవారం రాత్రి జగదీష్ తాగిన మైకంలో అదనపు కట్నం తేవాలంటూ తనపై కత్తితో దాడి చేశారని మేరీ తెలిపారు. గతంలోనూ ఇలాగే హింసించాడని... పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి : హెచ్ఎం వేధిస్తున్నాడని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం