నూతన మున్సిపల్ చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను సులభతరం చేస్తుంది. మున్సిపాలిటీల్లో అవినీతికి తావులేకుండా సేవలందించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా పౌరులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగకుండా ఆన్లైన్ ద్వారా అనుమతులు, సర్టిఫికెట్లు పొందేలా కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలోని ఈ-ఆఫీస్ ద్వారా టీఎస్- బీపాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ విధానం ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు.. వారికి గడువులోగా సర్టిఫికెట్లు, అనుమతులు లభిస్తాయని చెప్పారు. టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ-ఆఫీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక