కుమురంభీం ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా విపత్కర సమయంలో కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందించారని కొనియాడారు.
వారి సేవలు అభినందనీయమని... అందుకు గుర్తుగా నూతన వస్త్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, పలువురు పాలకవర్గ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్‌తో మానసిక రుగ్మతలు.. చికిత్స అవసరమంటున్న వైద్యులు