ETV Bharat / state

'ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే కుట్ర'

ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసేందుకు తెరాస సర్కారు కుట్ర పన్నుతోందని ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా పులులను వదులుతున్నారని ఆరోపించారు.

MP Soyam Bapurao at a press conference
విలేకర్ల సమావేశంలో ఎంపీ సోయం బాపురావు
author img

By

Published : Jan 6, 2021, 6:21 AM IST

ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసేందుకు తెరాస ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వకుండా అడవుల్లో పులులు వదులుతున్నారని ఆరోపించారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రం భాజపా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

పులులు పట్టుకోవాలి..

పులులను పట్టుకొని ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని సోయం అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 20రహదారులు, 3వంతెనల నిర్మాణం కోసం 150 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

తెరాస రంగు..

నాలుగు వరసల రహదారి నిర్మాణం కోసం 1200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే శిలాఫలకంపై తెరాస రంగు వేయడం సరికాదని విమర్శించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై కలెక్టర్​కు ఫిర్యాదు చేశామని.. స్పీకర్​కూ చేస్తామని పేర్కొన్నారు.

రైతు వేదికలకు కేంద్రం 10లక్షల చొప్పున మంజూరు చేసింది. వాటిపై తెరాస నేతల బొమ్మలు వేస్తున్నారు. ప్రధాని మోదీ బొమ్మలూ వేయాలి. పోడు భూముల జోలికి వెళ్లకూడదు. సాగుచేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలి.

-సోయం బాపురావు, భాజపా ఎంపీ

ఇదీ చూడండి: నెల గడిచినా కొత్త మేయర్‌ లేరు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.