తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోట పరంధోలి-మహారాజ్ గూడ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ జంగుబాయిదేవతను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఆసిఫాబాద్ శాసనసభ్యుడు ఆత్రం సక్కు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు.
ఎంపీ ల్యాండ్స్ నుంచి రూ.25 లక్షలు
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయ డోలు, సన్నాయిల మధ్య అటవీ ప్రాంతమంతా జనజాతరగా మారిపోయింది. జాతర అభివృద్ధి కోసం... ఆదివాసీ ప్రజాప్రతినిధులంతా కృషిచేయాలని ఎంపీ, ఎమ్మెల్యే సూచించారు. జంగుబాయి అమ్మవారి పరిసరాల్లో భక్తుల వసతి కోసం రూ.10 లక్షలు, రహదారి సౌకర్యం కోసం మరో రూ. 15 లక్షలు ఎంపీ ల్యాండ్స్ నుంచి కేటాయిస్తున్నట్లు ఎంపీ సోయం బాపురావు ప్రకటించారు.
అంతా మంచే జరుగుతుంది
దేశవ్యాప్తంగా ఆదివాసీ పండగలు, జాతరలకు తలమానికంగా భావించే జంగుబాయి దేవతను దర్శించుకుంటే మంచి జరుగుతుందనేది ఆదివాసీల అచంచల విశ్వాసం.
- ఇదీ చూడండి : పంటను కొనుగోలు చేయాలని రోడ్డుపై ఎమ్మెల్యే నిరసన