కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వామి వివేకానంద గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని స్థానిక శాసన సభ్యులు ఆత్రం సక్రు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండలి నిర్వాహకులు, పలువురు ప్రజానిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : లేజర్హాబ్గా ఆవిర్భవించనున్న భాగ్యనగరం..!