ETV Bharat / state

గన్నారం చెరువుకు గండి.. పరిశీలించిన ఎమ్మెల్యే - చెరువుకు గండి

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా.. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్​ నగర్​ మండలంలోని గన్నారం చెరువు వర్షపు నీటితో నిండి.. గండి పడింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వెంటనే చెరువు పరిస్థితిని పరిశీలించారు.

http://10.10.50.85//telangana/18-August-2020/tg-adb-26-18-cheruvu-gandi-mla-parishilana-av-ts10034_18082020191811_1808f_1597758491_354.jpg
గన్నారం చెరువుకు గండి.. పరిశీలించిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 18, 2020, 10:06 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​ నగర్​ గన్నారం మండలంలోని చెరువు వరుస వర్షాలతో పూర్తిగా నిండింది. చెరువులోకి భారీగా నీరు చేరడం వల్ల చెరువుకు గండి పడింది. గ్రామస్థులు ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సమాచారం అందించగా.. ఆయన వెంటనే గన్నారం చెరువును పరిశీలించారు. చెరువు కట్టకు గండి పడి.. కట్ట తెగే ప్రమాదముందని వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.

MLA Koneru konappa visits gannaram Cheruvu
గన్నారం చెరువు గండిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

గండి పడిన చోట తాత్కాలికంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేయాలని సూచించాారు. చెరువు కట్ట తెగితే భారీ ప్రమాదం, పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే గండి పూడ్చే పనులు మొదలు పెట్టాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరిసర గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువుకు పడిన గండిని పరిశీలించిన అధికారులు ప్రమాద నివారణ చర్యలు మొదలుపెట్టారు.

ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.