సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గ పరిధిలో అటవీ అనుమతులు ఆలస్యమై రోడ్ల నిర్మాణం జరగడం లేదని.. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సభలో ప్రస్తావించారు. అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వంద కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేసినా... అటవీ శాఖ అనుమతులు లేక నిర్మాణం ఆగిపోయిందని పేర్కొన్నారు. రోడ్డు లేకపోవడం వల్ల అంబులెన్స్ పోలేక... ఓ మాతృమూర్తి పురిట్లోనే బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అటవీ శాఖ మంత్రి దృష్టి పెట్టి రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: రహదారిలేక పురిట్లోనే బిడ్డను కోల్పోయిన మాతృమూర్తి