కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు పురపాలిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు.
తెరాస అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల గెలుపు వల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగదని ఆరోపించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా... అభివృద్ధికి పాటుపడేవారికే ఓటు వేయాలని కోనప్ప సూచించారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'