ETV Bharat / state

సామూహిక వివాహంతో ఒక్కటైన ఆరు జంటలు... ఎక్కడో తెలుసా!

mass wedding ceremony: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగామ్ గ్రామంలో ఈరోజు(బుధవారం) పేద గిరిజనులకు సామూహిక వివాహాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆరు జంటలు ఒక్కటైనాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పి ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మి, హాజరై జంటలను దీవించారు.

author img

By

Published : Mar 2, 2022, 6:37 PM IST

mass wedding ceremony
సామూహిక వివాహాలు

mass wedding ceremony: ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిర్పూర్(యు) మండలంలోని మహాగామ్ గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది సంత్ శ్రీ కోట్నాక సరోజి మహరాజ్ గురుదేవ్ సేవ ఆశ్రమంలో సామూహిక వివాహాల తంతు జరిగింది. సంత్ శ్రీ సరోజి మహారాజ్ చూపిన మార్గాన్ని ఆయన భక్తులు నేటికీ ఆచరిస్తూ నలుగురికీ చాటి చెప్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మహారాష్ట్రలోని కిన్వత్ తాలూకా సోనే గావ్ గ్రామంలో జన్మించిన సంత్ శ్రీ సరోజి మహారాజ్ మహాగామ్ గ్రామానికి వచ్చి ఇక్కడి ప్రజలకు మంచి చెడులు బోధించేవారు. ముఖ్యంగా మద్యానికి, మాంసాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించారు. క్రమేణా 1950వ సంవత్సరంలో గ్రామంలోని గుట్టపై శివాలయాన్ని నిర్మించారు. 1970లో సముదాయీక్ ప్రార్థన మందిరం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికతతో పాటు ఆచార వ్యవహారాలకు ఇక్కడి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

తాళిబొట్టు.. మెట్టెలు... అన్నదానం

నాలుగేళ్ల నుంచి ఈ గ్రామంలో జరిగే సామూహిక వివాహాలకు జెడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మి తాళిబొట్టు, మెట్టెలు అందిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సేవాశ్రమానికి ప్రజా ప్రతినిధులు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆశ్రమం యొక్క పీఠాధిపతి కైలాస్ మహారాజ్ తెలిపారు. మహారాజు చూపిన ఆధ్యాత్మిక మార్గాన్ని పాటిస్తూ ప్రజలందరికీ చాటి చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. పేదల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా కళ్యాణం జరిపించడం ఇక్కడి ప్రత్యేకత అని సూరోజి భక్తుడు భీం రావు తెలిపారు.

1971 నుంచి ఆనవాయితీగా..

పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతీ యువకుల వివాహాలు జరిపించడానికి 1971 సంవత్సరం నుంచి మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. సరోజి మహారాజ్ మరణించిన అనంతరం ఆయన ఆశయం కోసం, కోరిక మేరకు సేవా ఆశ్రమం సభ్యులు పేద యువతీ యువకులకు వివాహాలు జరిపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఏటా మహాశివరాత్రి రోజున ఒక్కటయ్యే జంటలను పెళ్లికొడుకు, పెళ్లి కూతురుగా తయారుచేసి మరుసటి రోజు సామూహిక వివాహాలు చేయిస్తామని సరోజి బాబా భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 300కు పైగా జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించామని... ఈ ఏడాది 6 జంటలు ఒక్కటైనాయని సేవాశ్రమం సభ్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పెళ్లి వాహనం బోల్తా.. వధువు తల్లితో సహా 9 మందికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.