ETV Bharat / state

సమస్యల నిలయాలుగా క్వారంటైన్​ కేంద్రాలు.. బాధితుల ఇబ్బందులు

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారయ్యాయి. పేరుకు క్వారంటైన్​ కేంద్రాలైతే ఏర్పాటు చేశారు కానీ.. వాటి నిర్వాహణ మాత్రం అధికారులు మర్చిపోయారు. కనీసం కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పట్టించుకునే నాథుడు కూడా లేడని బాధితులు వాపోతున్నారు.

many problems in quarantain centers at kumram bheem asifabad

author img

By

Published : Aug 29, 2020, 11:33 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో కరోనా బాధితుల కోసం నాలుగు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 150 మందికి పైగా కరోనా బాధితులు కోలుకుంటున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం అధ్వానంగా ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్ కేంద్రాల ఆవరణలో గతంలో ఉండి వెళ్లిపోయిన వారు పడేసిన చెత్త... ఇప్పటి వరకు శుభ్రపర్చలేదు. చెత్త వల్ల దోమలు తయారై ఇతర రోగాలు ఎక్కడ వస్తాయో అని కొవిడ్ రోగులు ఆందోళన చెందుతున్నారు.

నిర్వాహణలో కనిపించిన డొల్లతనం

బాధితులను సెంటర్లలో దించే వరకు మాత్రమే వైద్య సిబ్బంది డ్యూటీ పూర్తి అవుతుంది. ఆ తర్వాత క్వారంటైన్ సెంటర్లను సంబంధిత అధికారులు ఎవరు పర్యవేక్షించకపోవటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి సౌకర్యం లేదని ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయగా.. తనకు సంబంధం లేదని చెబుతున్నాడని బాధితులు ఆరోపించారు.

సిబ్బంది పనితీరు అధ్వానం

గోలేటి టౌన్షిప్​లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రంలో కరోనా అనుమానితుల కోసం ఏడు గదులు కేటాయించారు. గదుల్లో సరిపడా ఫ్యాన్లు అందుబాటులో లేవు. పాజిటివ్ వచ్చిన వారికి ఒక టాయిలెట్, అనుమానితుల కోసం కేవలం ఒక్క టాయిలెట్​ మాత్రమే కేటాయించారు.

మహిళలకు ఇబ్బందులు

క్వారంటైన్ సెంటర్లలో ఏర్పాటుచేసిన బాత్​రూములకు తలుపులు లేకపోవటం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాపలా ఉంటే మరొకరు స్నానం చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 15 రోజులు ఎలాగోలా గడిస్తే ఆ తర్వాత వెళ్ళిపోతామని తమలో తాము సర్ది చెప్పుకుంటున్నామని బాధితులు వాపోతున్నారు.

ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.