కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం మొర్లిగుడాకు చెందిన గోడ సత్తయ్య ఈ రోజు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఒప్పుకోవాలని సత్తయ్యతో పాటు మడే హన్మంతును ఎస్ఐ వేధిస్తున్నందుకే పురుగుల మందు తాగినట్లు సత్తయ్య భార్య పుష్ప తెలిపారు. స్థానికులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కాగజ్నగర్ ఇంఛార్జీ డీఎస్పీ సత్యనారాయణ ఆసుపత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత