కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ డివిజన్లోని చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో టెంట్లు వేసి బహిరంగంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మద్యం నిషేధించడం వల్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నప్పటికీ అధికారులు చోద్యం చూడడం పలు విమర్శలకు తావిస్తోంది.
అక్రమంగా తరలిస్తూ...
నూతనంగా ఏర్పడిన చింతలమానేపల్లి మండలానికి మద్యం దుకాణం మంజూరవగా రవీంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వంతెన నిర్మాణ పనులు పూర్తికావడం వల్ల మహారాష్ట్రకు ఇక్కడి మద్యం అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడితే.. అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: కాలేేజీలు తెరవాలని రోడ్డెక్కిన విద్యార్థులు