కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఎక్సైజ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. మద్యం సేవించి తమ ఆచారాలకు విరుద్ధంగా బుట్లు వేసుకుని.. తమ ఇళ్లల్లో ఆబ్కారీశాఖ తనిఖీలు నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం నిల్వచేస్తున్నారనే నెపంతో ఇళ్లల్లో ఆడవాళ్లు మాత్రమే ఉన్న సమయంలో అధికారులు సోదాలు నిర్వహించడం పట్ల ఆగ్రహానికి గురైన వారు.. ఎక్సైజ్ అధికారులను చుట్టుముట్టి నిర్బంధం చేశారు.
ఆబ్కారీ శాఖ అధికారి నరహరి మద్యం సేవించి తనిఖీ నిర్వహించారని ఆరోపిస్తూ.. అతని వాహనాన్ని అడ్డుకొని జైనూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అతన్ని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్ష చేయగా అధికారులు మద్యం సేవించినట్టు నిర్ధారణ అయ్యింది. దానితో నరహరిపై కేసునమోదు చేసి.. విచారణ జరపాలని లెండిగూడ గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నకిలీ బంగారు కడ్డీలు చేతులోపెట్టి ఆరున్నర లక్షలతో ఉడాయింపు