ETV Bharat / state

రంగు వినాయకులు వద్దు.. మట్టి గణపతులే ముద్దు.. - kumurambheem people encouraging eco friendly ganesh for festival

రసాయనాలు, రంగులతో తయారుచేసిన లంబోదరుని ప్రతిమలు వీరు వాడరు. ప్రకృతికి హాని కలగని వస్తువులతో విగ్రహాలను తయారుచేసుకుని వాటినే పూజిస్తారు కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లావాసులు.

రంగు వినాయకులు వద్దు.. మట్టి గణపతులే ముద్దు..
author img

By

Published : Sep 1, 2019, 7:55 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో వినాయకులు ఎంతో ప్రత్యేకం.. గణనాథుడిని సహజసిద్ధంగా దొరకే ఎర్రమట్టి, వరిగడ్డి, జనుమును ఉపయోగించి తయారు చేసి వాటినే పూజిస్తారు. విగ్రహాలను నిమజ్జనం చేసినా.. వీటిలో వాడే వస్తువులు ప్రకృతి ఒడిలో సులభంగా కలిసిపోయి పర్యావరణాన్ని ఎటువంటి కలగదంటున్నారు పట్టణవాసులు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం వల్ల కళలను బ్రతికించినట్లు అవుతుందని... ఎంతో మందికి ఉపాధికి దారి దొరుకుతుందని తయారీదారులు చెబుతున్నారు. మట్టి వినాయకుల్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని నినాదాలు చేస్తున్నారు.

రంగు వినాయకులు వద్దు.. మట్టి గణపతులే ముద్దు..

ఇదీ చదవండిః నూతన గవర్నర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మట్టివినాయకుల తయారీ.

రంగు వినాయకులు వద్దు మట్టి వినాయకులు ముద్దు

పూర్వం నుండి మన సాంప్రదాయం ప్రకారము మట్టి వినాయకులను వాడుతున్నారు. వినాయకులను సహజ సిద్ధంగా దొరికే ఎర్రమట్టి ,వరిగడ్డి ,జనుమును ఉపయోగించి తయారు చేస్తారు. వీటిలో వాడే వస్తువులను కూడా మన ప్రకృతి ఒడిలో సులభంగా, ఉచితంగా లభిస్తాయి. ఈ వస్తువులతో తయారు చేసిన విగ్రహాలను నవరాత్రులలో 21 రకాల పుష్పాలు , పత్రాలతో పూజించి నిమజ్జనం చెరువులలో వాగులలో కలుపుతారు. దీనిలో ఉపయోగించిన వస్తువులు అన్ని నీటిలో సులభంగా కలిసిపోతాయి. దీనిలో వాడిన పుష్పాలు ,పండ్లు ,ఆకులు, జలచరాలకు, పశుపక్ష్యాదులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. పర్యావరణ హితంగా ఉంటుంది.

కానీ నేడు అనేక రసాయన రంగులు మరియు ప్లాస్టర్-ఆఫ్-పారిస్ ను వాడి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ వాడుతున్నారు. దీని వలన పర్యావరణానికి హాని కలిగి ప్రకృతి సమతుల్యత లోపించడం జరుగుతుందని మేధావులు పేర్కొంటున్నారు. మట్టి వినాయకులను ప్రోత్సహించడం వలన కళలను బ్రతికించినట్లు అవుతుంది, ఉపాధి దొరుకుతుందని వినాయకులను తయారు చేసే వారు పేర్కొంటున్నారు.

మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_26_01_rangu_vinayakulu_vaddu_matti_vinayakulu_muddu_avb_ts10078

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.