కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రాజంపేట వీధిలో గణేష్ మండపంలో సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తూ గణపతిని పూజిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండిః కాగజ్‌నగర్‌లో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు