కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్ గ్రామస్థులు… తమ ఊళ్లోకి కొవిడ్ మహమ్మారిని రానీయ్యొద్దు తల్లీ అంటూ ఊళ్లో ఉన్న మహిళంతా గ్రామదేవతకు పూజలు చేశారు. సుమారు రెండొందల మంది తడి వస్త్రాలతో నీళ్ల బిందెలను మోసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. భౌతిక దూరం పాటించకుండా.. మాస్కులు ధరించకుండా పూజలు చేశారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు, భౌతిక దూరం పాటించండి... మాస్కులు ధరించండి... కొవిడ్‌కు చికిత్స కంటే నివారణే నయమని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మరింత ప్రమాదమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇదీ చూడండి: అనవసరంగా బయటకొస్తే కేసులే..