ETV Bharat / state

Koti goti Talambralu: భద్రాద్రి రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు - Koti Talambralu for bhadradri ramayya kalyanam

Koti goti Talambralu: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమైంది. ఎటువంటి యంత్రాలు వాడకుండా స్వయంగా గోళ్లతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఒడ్లను ఒలిచి.. రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పంపిస్తున్నారు. ఈ మేరకు ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళలు ఈ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా కాళేశ్వరం పుష్కరాల కోసం గౌరమ్మలను తయారుచేస్తున్నారు.

koti goti talambralu
రామయ్య కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు
author img

By

Published : Mar 13, 2022, 1:44 PM IST

Koti goti Talambralu: భద్రాద్రి రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు తయారు చేసి.. పంపించే కార్యక్రమాన్ని కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో మహిళలు చేపట్టారు. రెండేళ్లుగా ఆసిఫాబాద్​ మహిళలు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామం నుంచి వడ్లను తెప్పించి... గోటితో ఒలిచి భద్రాచలం పంపిస్తున్నారు. స్థానిక వాసవి కన్యాకపరమేశ్వరి ఆలయంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాములవారి పాటలు, లలిత సహస్రనామాలు ఆలపిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో వడ్లను ఒలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు వృద్ధులు కూడా పాల్గొని రామయ్యపై భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా కాళేశ్వరం పుష్కరాల కోసం పసుపుతో గౌరమ్మలను తయారుచేస్తున్నారు.

మా అదృష్టంగా భావిస్తున్నాం

రెండేళ్లుగా గోటితో కోటి తలంబ్రాలు కార్యక్రమంలో పాల్గొంటున్నామని మహిళలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో రాములవారి కల్యాణానికి హాజరు కాకపోయినప్పటికీ.. తమ చేతుల మీదుగా తలంబ్రాలు తయారుచేయటం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. స్వామి వారి సేవలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. అదేవిధంగా కాళేశ్వరం పుష్కరాల కోసం పసుపుతో గౌరమ్మలను తయారుచేసి పంపతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎడ్లతో దున్నకుండా

"రెండేళ్లుగా ఆసిఫాబాద్​లో గోటితో కోటి తలంబ్రాలు తయారు చేసి భద్రాద్రి రామయ్య కల్యాణానికి పంపిస్తున్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. సీతారాముల కల్యాణానికి హాజరు కాకపోయినా.. స్వయంగా మా చేతులతో తలంబ్రాలు తయారు చేసి పంపిస్తున్నాం. ఏపీలోని తూ.గో జిల్లా కోరుకొండ నుంచి మాకు వడ్లు వస్తాయి. అక్కడ నాగలికి ఎడ్లు ఉపయోగించకుండా స్వయంగా మనుషులే దున్ని.. వడ్లు పండిస్తారు. ఆ వడ్లనే తలంబ్రాలుగా ఒలుస్తున్నాం." -నాగలక్ష్మి, నిర్వాహకురాలు

మొదటగా వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన మహిళలు.. ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ముగ్గులు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటి గోటి తలంబ్రాలు, గౌరమ్మల తయారీ కార్యక్రమం ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో మనుషులే దేవుళ్ల రూపంలో వడ్లను నాటి వారే కోత కోసి తయారు చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

భద్రాద్రి రాములోరి కల్యాణానికి గోటితో కోటి తలంబ్రాలు

ఇదీ చదవండి: ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ.. అనంతరం భక్తులకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.