లాక్ డౌన్ నియమాలు తెలియక బస్టాండ్లో చిక్కుకుపోయిన ముసలవ్వను ఇంటికి పంపించి సేవాగుణాన్ని చాటుకున్నాడు ఓ పోలీస్ అధికారి. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విర్దండి గ్రామానికి చెందిన ముసలవ్వ… కౌటాల మండల కేంద్రానికి వచ్చి సరుకులు తీసుకుంది. తీరా ఇంటికి వెల్ధామని చూడగా ఒక్క బస్సు కానీ ఆటో కానీ కనిపించలేదు. ఏం చేయాలో తోచక ఆ ముసలవ్వ సుమారు రెండు గంటల పాటు అలాగే బస్టాండ్ లో ఎదురుచూడసాగింది.
సమాచారం తెలుసుకున్న కౌటాల సీఐ బుద్దె స్వామి.. అవ్వ వివరాలు కనుక్కున్నాారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అవ్వ పరిస్థితి గమనించి.. ఆటో ఏర్పాటు చేసి ఇంటికి పంపించి తన మంచి మనసు చాటుకున్నాడు. లాక్ డౌన్ అమలులో ఉన్నంత వరకు 10 గంటల తరువాత రవాణా సౌకర్యం ఉండదని.. త్వరగా పనులు ముగించుకుని వెళ్లాలని బుద్దె స్వామి ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు