గుస్సాడీ రాజుగా ఆదివాసీల మదిలో నిలిచిన కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి కళారంగంలో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈయన ఒక్కరికే ఈ గౌరవం లభించటం విశేషం.
కుమురం భీం జిల్లా వాసి అయిన కనకరాజు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే గుస్సాడీ నృత్యాన్ని దిల్లీ వేదికగా చాటారు. జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన ఈయన జిల్లాలో విద్యాభివృద్ధికి తోడ్పాడ్డారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవిరళ కృషి సలిపారు.
- ఇదీ చూడండి : ఈ ఏడాది 'పద్మం' వరించింది వీరినే..