పార్టీలకతీతంగా ప్రాజెక్టు నిర్మాణానికి పోరాడతాం కుమురం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్థలాన్ని తెజస అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు చేపడితే 30వేలకోట్లతో పూర్తయ్యేదని, కాళేశ్వరం ప్రాజెక్టు 80వేల కోట్లు దాటుతుందని ఆరోపించారు. ఇక్కిడి నుంచి ఎల్లంపల్లికి జలాల తరలింపుకు ఒక లిఫ్ట్ అవసరమైతే మెడిగడ్డ నుంచి తరలించడానికి మూడు లిఫ్టులు వాడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోదండరాం కోరారు.
ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి