ఇవీ చదవండి:ఉత్తమ్ సెల్యూట్
కార్మికులను పట్టించుకోండి - harish babu
సిర్పూర్ పేపర్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నాయకులు మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్పేపర్ మిల్ యాజమాన్యం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. మిల్లు తెరిస్తే జీవితాలు బాగుపడతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలిందన్నారు. పనిలోకి స్థానికులను కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి ఒక్కరికి 35వేల రూపాయలు ఖాతాలో వేస్తామని మభ్యపెట్టారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ హరీశ్ బాబు మండిపడ్డారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:ఉత్తమ్ సెల్యూట్
sample description