ETV Bharat / state

తనపై మున్సిపల్ ఛైర్మన్​ దాడి చేశారని ఏఈ ఆరోపణ - కాగజ్​నగర్ పురపాలక సంఘం వార్తలు

attack
attack
author img

By

Published : Nov 18, 2020, 6:04 PM IST

Updated : Nov 18, 2020, 8:29 PM IST

18:02 November 18

తనపై మున్సిపల్ ఛైర్మన్​ దాడి చేశారని ఏఈ ఆరోపణ

   కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ పురపాలక సంఘం ఛైర్మన్ సద్దాం హుస్సేన్ తనపై దాడి చేశారని ఏఈ సతీశ్​ ఆరోపించారు. కార్యాలయంలో విధుల్లో ఉన్న తనపై అకారణంగా భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. డీఈ గోపాల్ ఇతర సిబ్బంది చూస్తుండగానే బూతులు తిడుతూ చేయిచేసుకున్నారని, కుర్చీతో గాయపర్చారన్నారు. గతంలోనూ ఇదేవిధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు.  

   ఈ విషయాన్ని కమిషనర్ శ్రీనివాస్, పై అధికారులకు తెలిపినట్లు సతీశ్​ చెప్పారు. ఈ విషయమై ఛైర్మన్ సద్దాం హుస్సేన్ సంప్రదించగా.. తాను ఎవరిపై దాడి చేయలేదని..  ఆ ఆరోపణలన్ని అవాస్తవమని కొట్టిపారేశారు. ఏఈ సతీశ్​ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిల్ మొత్తం మీడియా సమావేశం పెట్టి చెబుదాం అనుకునేలోపు ఇలాంటి ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని సద్దాం హుస్సేన్ అన్నారు. 

ఇదీ చదవండి : 'వంద' చోరీ... దొంగకు ప్రజల దేహశుద్ధి

Last Updated : Nov 18, 2020, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.