రాష్ట్రంలోని పేదలు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడంలో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని కోనప్ప అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు, పురపాలక సంఘం అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.