ETV Bharat / state

మహారాష్ట్ర, ఏపీలోని నకిలీ విత్తనాలు తెలంగాణకు.. - వరదాల వచ్చి ముంచుతున్న నకిలీ విత్తనాల ముంపు

నియంత్రిత సాగు విధానంలో జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైతు సమగ్ర వివరాలు, భూముల స్వభావాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు పల్లెలకు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో నిమిత్తం లేకుండా తమ ఏజెంట్ల ద్వారా దళారులు కావాల్సినంత చేరవేస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీ నుంచి ఏటా కుమురం భీం జిల్లాకు బీటీ-3 విత్తనాలు వరదలా వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంత గిరిజన రైతులను సైతం వదలకుండా ఈ బీటీ విత్తనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి.

huge duplicate seeds coming to kumuram bheem asifabad district
వరదాల వచ్చి చేరుతున్న నకిలీ విత్తనాల ముంపు
author img

By

Published : May 27, 2020, 9:25 AM IST

హారాష్ట్ర నుంచి ప్రాణహిత నది మీదుగా కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సరిహద్దు మండలాలైన చింతలమానేపల్లి, బెజ్జూర్‌, కౌటాల, పెంచికల్‌పేట, దహెగాం మండలాల్లో, ఇటు మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న కెరమెరి, జైనూర్‌, నార్నూర్‌ మండలాల మీదుగా నకిలీ విత్తనాలు వస్తున్నాయి.

అన్ని గ్రామాల్లో ఈ నకిలీ దందా యథేచ్ఛగా కొనసాగుతోంద. ఏటా ఈ తంతు జరుగుతున్నా, అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విత్తే కాలం ప్రారంభం కాకముందే జిల్లాలో బెజ్జూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లో నకిలీ విత్తనాలను అధికారులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు. గొలుసుకట్టుగా ఉన్న ఈ నకిలీ దందాలో మూలాల నుంచి ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడితేనే, కఠిన శిక్షలు అమలయితేనే, బీటీ-3 జిల్లాకు రాకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లూజుగా ఆకర్షణీయమైన ప్యాకెట్లలో..

ఈ నెల 16న బెజ్జూర్‌ పోలీసులు 36 కిలోల విడి నకిలీ పత్తి విత్తనాలు తనిఖీల్లో భాగంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న నాణ్యమైన పత్తి విత్తనాల సంచులు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉన్నాయి. ఈ బీటీ-3 విత్తనాల ప్యాకెట్ల ధర రూ.700 నుంచి రూ.1000 వరకు ఉంది. మరోవైపు బీటీ-3 విత్తనాలు వేసిన పంట కలుపు నివారణ సులువవుతుందని, కూలీల ఖర్చులు మిగులుతాయని రైతులు భావిస్తున్నారు.

ఏజెన్సీలో గిరి రైతులను మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను దళారులు అంటగడుతున్నారు. సిర్పూర్‌(యు) మండలంలో పంగిడి గ్రామానికి చెందిన వ్యక్తి మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన 89 నకిలీ విత్తన సంచులను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.62 వేల వరకు ఉంటుంది. ఈ నకిలీ విత్తన సంచులను సరఫరా చేసిన మహారాష్ట్రలోని జివితి తాలుకాకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి రాజస్థాన్‌ నుంచి ఈ ప్యాకెట్లు సరఫరా అయ్యాయని గుర్తించారు.

బెజ్జూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్తి విత్తనాలు, అదుపులో నిందితులు

కఠిన చర్యలు తీసుకుంటాం... - రవీందర్‌, ఇన్‌ఛార్జి జిల్లా వ్యవసాయ శాఖాధికారి

నకిలీ విత్తనాలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పాలనాధికారి ఆదేశాలనుసారం డివిజన్‌లు, మండలాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. తహసీల్దార్‌, ఎస్‌ఐతో పాటు వ్యవసాయాధికారులు ఇందులో ఉంటారు. జిల్లాలో ప్రస్తుతం మూడు డివిజన్‌లు ఉండగా, ఒక్కో డివిజన్‌ వ్యవసాయాధికారి మరో డివిజన్‌లోని ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేస్తారు. బీటీ-3ని సరఫరా చేసే వారిపై పీడీయాక్ట్‌ కేసులు సైతం పెడతాం. రైతులు సైతం వీటిని దరి చేరనీయవద్ధు స్థానిక వ్యవసాయధికారులను సంప్రదించి, అనుమతి ఉన్న ఎరువుల దుకాణాల్లో రసీదు తీసుకుని పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.