కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూసినా.. అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పదిహేను రోజులుగా ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నా.. అధికారులు కాలయాపన చేస్తూ.. ధాన్యం కొనడం లేదని వాపోతున్నారు. తేమ, తాలు పేరుతో.. అధికారులు కాలయాపన చేస్తున్నారని.. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తొందరగా స్పందించి.. ధాన్యం కొనుగోలు చేసి.. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు