కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉట్నూర్ నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. కలప తరలిస్తున్న వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను జిల్లా కేంద్రంలోని అటవీ చెక్పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆసిఫాబాద్ ఎఫ్ఆర్వో అప్పలకొండ అదుపులోకి తీసుకున్నారు.
ఉట్నూర్ నుంచి మంచిర్యాలకు డీఎస్4సీఏడీ0708 టవేరాలో అక్రమంగా కలప తరలుతుందన్న పక్కా సమాచారంతో దాడిచేసి వాహనాన్ని పట్టుకున్నామని అప్పలకొండ తెలిపారు. రూ. 30 వేల విలువైన 8 కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: పసిడి వన్నెలో కనువిందు చేస్తున్న గ్రహణ సూర్యుడు