ETV Bharat / state

'అత్యాచార నిందితుడిని శిక్షించాలి' - students

చిర్రకుంట అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుమరం భీం ఆసిఫాబాద్​లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. నిందితుడు జ్ఞానేశ్వర్​ను ఉరితీయాలని డిమాండ్  చేశారు.

నినాదాలు చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Jul 2, 2019, 10:12 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలో ఆదివారం ఓ చిన్నారిని జ్ఞానేశ్వర్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడిని ఇంత వరకు పట్టుకోలేదు. ఆగ్రహం చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. అంబేడ్కర్​ చౌరస్తా వరకు ర్యాలీ తీసి మానవహారం నిర్వహించారు. అత్యాచారం జరిగి 40 గంటలు గడుస్తున్నా నిందితున్ని అరెస్ట్ చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలో ఆదివారం ఓ చిన్నారిని జ్ఞానేశ్వర్ అనే కామాంధుడు అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడిని ఇంత వరకు పట్టుకోలేదు. ఆగ్రహం చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. అంబేడ్కర్​ చౌరస్తా వరకు ర్యాలీ తీసి మానవహారం నిర్వహించారు. అత్యాచారం జరిగి 40 గంటలు గడుస్తున్నా నిందితున్ని అరెస్ట్ చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఇవీ చూడండి: వరదలపై ముంబయి వాసుల ఐక్య పోరాటం

Intro:

యాంకర్ పార్ట్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో ఆదివారం జరిగిన చిన్నారులపై అత్యాచారం చేసిన నిందితున్నీ కఠినంగా శిక్షించాలి అని కళాశాల విద్యార్థులచే వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు చౌరస్తాలో మానవహారం నిర్వహించారు.


*అత్యాచార నిందితున్ని వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ,మానవ హారం*
ఈ రోజు జిల్లా కేంద్రంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో పసిపిల్ల పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నైతం.జ్ఞానేశ్వర్ ను వెంటనే పట్టుకొని ఉరితియ్యలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున్న స్థానిక అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చెయ్యడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకుడు ఆత్మకురి చిరంజీవి మాట్లాడుతూ ఈ రోజు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల పాలనలో మహిళలకు రక్షణ కరువైందని,దేశంలో ఏదో ఒక మూలన ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.మారుమూల గిరిజన గ్రామమైన అసిఫాబాద్ జిల్లాకి కూత వేటు దూరంలో ఉన్న చిర్రాకుంట గ్రామంలో అభం, శుభం తెలియని చిన్నారిపై అత్యాచార యత్నం జరగడం చాల బాధకరమైన విషయమని అన్నారు. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులపై ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వ్యాపారవేత్తలు, అగ్రకులాల వారికి చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే నిమ్మకు నిరేతనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని ఇలాంటి ప్రభుత్వపాలనను ఇప్పటివరకు చూడలేదని,నిరంకుశత్వా పాలనలో పెదవాళ్ళకి ముఖ్యంగా మహిళలకు రక్షణ కరువైందని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే గిరిజన ప్రాంతమైన అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని ఉరి తీసే కార్యక్రమానికి పూనుకోవాలని కోరారు. అత్యాచారం జరిగి నేటికి 40 గంటలు గడుస్తున్నా నిందితున్ని అరెస్ట్ చెయ్యకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరో సంఘటన జరుగకుండా నిందితున్ని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పొల్కర్. సాయిరాం, జగజంపుల.తిరుపతి, ఎండీ. సల్మాన్ ఖాన్, షేక్. సమీర్, గుండా.శ్యామ్, ఎండీ.ఆసిఫ్, కోదురుపాక. మహేష్, కొడప.నవీన్, నైతం.ప్రభాకర్, సాయి శ్రావణ్ మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.Body:Tg_adb_26_02_maanava_haaram_avb_TS10078Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.