కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీతో కలిపి సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి గ్రామం నుంచి ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని జబల్ పూర్‌కు 9వేల ట్రేలతో వెళ్తున్న కోడి గుడ్ల లారీ పెద్ద వాగు సమీపంలో మరో లారీని తప్పించబోయి బోల్తా పడింది. రోడ్డు మధ్యలో గుంతలు ఉండటం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా సుమారు రూ. 2లక్షల 70వేల విలువైన కోడిగుడ్లు నేలపాలయ్యాయి.
ఇదీ చదవండి: వారి కృషి ఫలించింది.. సర్కారు కల నెరవేరింది.!