జిల్లా విద్యాధికారి భిక్షపతి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని.. రోజు అల్పాహారం కిచిడి పెడుతున్నారని విద్యార్థినులుతెలిపారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం వడ్డిస్తున్నారని అన్నారు. ఆహార పట్టిక ప్రకారం తమకు భోజనం ఎందుకు పెట్టడం లేదని ఎస్.ఓ. అమూల్యను అడిగితే తమను కొట్టి తిడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. అనంతరం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: వేసవికి ముందే అడుగంటేశాయి