ETV Bharat / state

అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలను ప్రారంభించిన కోనప్ప

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని కాగజ్​నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​​​లో నిర్వహించిన అంతరాష్ట్ర క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు.

Cricket Tournament organized at Kagaznagar, Asifabad District
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే
author img

By

Published : Jan 12, 2021, 3:46 PM IST

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని కాగజ్​నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలను... పురపాలిక ఛైర్మన్ సద్దాం హుస్సేన్​తో కలిసి టాస్ వేసి ఆయన ప్రారంభించారు. న్యూఎరా, ఎంఎంసీసీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

కాగజ్​నగర్​లో అంతర్రాష్ట్ర క్రికెట్​ పోటీలను నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. కాగజ్​నగర్ గోల్డెన్ పేరిట నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్​లో తెలంగాణ, మహారాష్ట్ర నుంచి 16 జట్లు పాల్గొననున్నాయి. టోర్నమెంట్ మొదటి రోజు కాగజ్​నగర్, బెల్లంపల్లి జట్లు తలపడుతున్నాయి.

ఇదీ చదవండి: జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.