కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని వార్డుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వారు చికిత్స తీసుకోవాలని తెలిపారు. కొవిడ్ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, కమిషనర్ కె.శ్రీనివాస్ నివారణ చర్యలను సమీక్షించారు.
కరోనా సోకిన వారు బయటకు రాకూడదని ఆదేశించారు. లాక్డౌన్ అమలుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత