కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలోని ఓ కాటన్ మిల్లు ఎదుట పత్తి రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలులో ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.రైతులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.
మూడు, నాలుగు రోజులుగా కొనుగోళ్లు లేకపోవడం వల్ల... రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని వారు ఆవేదన వ్యకం చేశారు. మిల్లు వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అడిగిన వారిపై మార్కెట్ సిబ్బంది దూసుకెళ్లారు.
క్వింటాలును 15వందల నుంచి 3వేలకే తమ వద్ద కొంటున్న దళారులు.. బయట 5నుంచి 6వేల వరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల మిల్లర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో పత్తి లోడ్లతో వచ్చిన వాహనాలు..... కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి కాటన్ మిల్లు వరకు భారీగా నిలిచిపోయాయి.
ఇవీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న తర్వాత మెడనొప్పి!