కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను జయంచి ప్లాస్మాను దానం చేశాడు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నితిన్ కుమార్. మిషన్ భగీరథలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నితిన్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. మొదట భయాందోళన చెందిన నితిన్... అన్ని జాగ్రత్తలు తీసుకుని ధైర్యంగా కొవిడ్‌ను ఎదుర్కొన్నాడు. వ్యాధి నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాడు.
వ్యాధిగ్రస్థులను ఆదుకోవాలన్న సదాశయంతో తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ప్లాస్మా దానం చేసి శెభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా వ్యాధిగ్రస్థులకు మనోధైర్యం కల్గించేలా వైరస్ నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకు వచ్చి దానం చేసి ఆదుకోవాలని నితిన్ కోరుతున్నాడు.