నిర్మల్‌లోని సహకార సంఘ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సహకార సంఘం ఎన్నికల్లో అధికారులు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. దాదాపు గంటకు పైగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. దిలావార్పూర్ మండలం బండపల్లి రైతు సహకార సంఘంలో డైరెక్టర్ పదవి కోసం రవి అనే వ్యక్తి నామమాత్రం దాఖలు చేశారని పేర్కొన్నారు.
బకాయి కారణంగా అతని నామ పత్రాన్ని తిరస్కరించాలంటూ అభ్యర్థన వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అర్హత ఉన్న వారి వివరాలతో ఇప్పటికే ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారని, జాబితాలో పేర్కొన్న వారు పోటీ చేసేందుకు అర్హులన్నారు.
ఇదీ చూడండి: ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్‌కే!