సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి తుమ్మడిహట్టి పర్యటనకు పయనమయ్యారు. ప్రాణహిత నదిపై తుమ్మడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించి గ్రామిటీ ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలించాలనే డిమాండ్‌తో వెళ్లారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, వీహెచ్, పొన్నాల, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు , ఏఐసీసీ కార్యదర్శులుతో పాటు ముఖ్య నాయకులు ప్రాజెక్టును సందర్శించి... క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోనున్నారు. తుమ్మడి హట్టి నుంచి మైలారం వరకు 70కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో ప్రాణహిత నీటిని తరలించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రచారం చేయడమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు.
ఇవీ చూడండి:ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం