కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా రెబ్బెన మండలం గోలేటి, తిర్యాని మండలాల్లోని ఉపరితల గనుల్లో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సింగరేణికి కోట్లలో నష్టం వాటిల్లుతోందని జీఎం కొండయ్య తెలిపారు. రెండు రోజుల నుంచి వర్షం కారణంగా భూ ఉపరితల గనుల్లో రెండు షిఫ్టుల్లో పనులు నిలిచిపోవటం వల్ల కార్మికులు విధులకు హాజరు కావటం లేదన్నారు. బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోవటం వల్ల ఓసీ 2, కైరిగూడ ఓసీలలో 9000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని జనరల్ మేనేజర్ వెల్లడించారు.
వర్షాల కారణంగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి... కోట్లలో నష్టం - coal mines updates
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుమురం భీం ఆసిపాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు షిప్టుల్లో పనులు నిలిచిపోవటం వల్ల సింగరేణికి కోట్లలో నష్టం వాటిల్లిందని జీఎం కొండయ్య వెల్లడించారు.