కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరకు చెందిన కేంద్రే బాలాజీ.. నాలుగేళ్లుగా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో సేంద్రియ విధానంలో ఆపిల్ సాగు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఆపిల్ సాగు చేసి సఫలీకృతుడైన యువకుడికి ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావడంతో ఆనందంలో మునిగిపోయాడు.
సోమవారం ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి ఫోన్‌లో బాలాజీతో మాట్లాడారు. సీఎం నుంచి పిలుపు వచ్చినట్టు తెలిపారు. వారంలోగా పంట చేతికొస్తుందని, హైదరాబాద్‌కు వెళ్లి సీఎంకు ఆపిళ్లను అందించాలనే తన కోరిక నెరవేరనుందని బాలాజీ చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే ఈ ప్రాంతాన్ని తెలంగాణ కశ్మీర్‌గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు.
2017, జూన్ 2న రాష్ట్ర ఉత్తమ రైతుగా సీఎం నుంచి బాలాజీ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన రైతు సమన్వయ సమితి (రైసస) మండల కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.
ఇవీ చూడండి: కరోనా నియంత్రణకు కేంద్రం రూ.6,195 కోట్లు విడుదల