దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తాడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం పర్యాటకులను కనువిందు చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని తాడోబా అభయారణ్యాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత కనిపించి అబ్బురపరిచింది. ఇక్కడ వివిధ రకాల జంతువులు, మృగాలు ఉన్నప్పటికీ.. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత సంచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం తాడోబా అభయారణ్యంలో కనిపించిన నల్ల చిరుత.. మళ్ళీ 2020 ప్రారంభంలో కనిపించింది.
ఇవీచూడండి: రెండురోజుల్లో ఎన్ని"కోట్లు" తాగేశారో తెలుసా?