ETV Bharat / state

'రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి' - కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా తాాజా వార్తలు

రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలని.. భాజపా యువ మోర్చా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సుచిత్ డిమాండ్​ చేశారు. బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.

bjym leaders protest in komuram bheem asifabad district
రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
author img

By

Published : Jan 9, 2021, 7:27 PM IST

రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలని.. భాజపా యువ మోర్చా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు సుచిత్ డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతి చెల్లించాలని పేర్కొన్నారు.

బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కరోనా లాక్​డౌన్ కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు 9నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వారికి తక్షణమే 9 నెలల గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యువ మోర్చా నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: సింగరేణి పుట్టినింట 15 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.