తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర నాయత్వం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరని నాయకులు అన్నారు.
రజాకార్లతో పోరాడిన వీరులకు నిజమైన నివాళులు మీరు ఇవ్వాలనుకుంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 9న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జూడేఘాట్లోని కుమురం భీమ్ స్మృతివనంలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఆ సభకు కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజలను తీసుకొచ్చారని ఏడుగురు భాజపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్