ETV Bharat / state

పక్షి ప్రేమికులకు 'బర్డ్ వాక్ ఫెస్టివల్'

దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు, జలజల పారే సెలయేళ్లు.. ప్రకృతి రమణీయతను కట్టిపడేసే అందాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం. వీటిలో విభిన్న రకాల పక్షి జాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇలాంటి అందాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడం, పక్షి ప్రేమికుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించే ఆలోచనతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు.

పక్షి ప్రేమికులకు 'బర్డ్ వాక్ ఫెస్టివల్'
birds_festival in kumurambheem asifabad district
author img

By

Published : Dec 12, 2019, 12:38 PM IST

పక్షి ప్రేమికులకు 'బర్డ్ వాక్ ఫెస్టివల్'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 14, 15న ప్రకృతి ప్రేమికుల కోసం 'బర్డ్​ వాక్ ఫెస్టివల్' అటవీశాఖ అధికారులు జరపనున్నారు. పక్షి ప్రేమికులు ఇప్పటికే వారి పేర్లను నమోదు చేసుకున్నారని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు. ఈ పండుగను వీక్షించాలంటే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే.

ఈనెల 14, 15న ఫెస్టివల్...

జిల్లాలో పక్షి జాతులు వాటి అధ్యయనం కోసం ఈనెల 14, 15న 'బర్డ్ వాక్ ఫెస్టివల్' నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి అడవుల్లో కొత్త కొత్త పక్షులు దర్శనమిస్తాయి. ఇప్పటికే 270 రకాల పక్షులను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. విభిన్న జాతులు కలిగిన వీటిని వీక్షించడం, ఆల్బమ్​గా రూపొందించడం, గ్రామస్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పండగకు శ్రీకారం చుట్టారు.

100 మంది పక్షి ప్రేమికులు..

ఇప్పటికే దాదాపు 100 మంది వరకు పక్షి ప్రేమికులు, ఉత్సాహవంతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా 14 ,15న నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ఫొటోలు, వీడియో చిత్రీకరణ, డాక్యుమెంటరీ తయారు చేస్తారు. సర్వే, పక్షుల విధానంపై అధ్యయనం చేసి... గ్రామస్థులతో మమేకమై ప్రకృతి పట్ల ప్రేమ, అడవుల ప్రాధాన్యత ను వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాలు..

కాగజ్​నగర్ మండలంలోని కోసిని, సిర్పూర్ (టి ) మండలంలోని మాలిని గుట్టలు, బెజ్జూర్, పెంచికల్​పేట్ మండలాలలోని నందిగామ గుట్టలు, పాలారపు గుట్టలు, మొర్రిగూడ ప్రాణహిత తీరం, తిర్యాని మండలంలోని గుండాల, ఆసిఫాబాద్ మండలంలోని కుమురం భీం జలాశయం ప్రాంతాల్లో 'బర్డ్ వాక్ ఫెస్టివల్' కోసం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కోట వైభవం భళా... సౌకర్యాలకై విలవిల

Intro:నోట్:--tg_adb_25_11_birds_festival_pkg_ts10078,
ఇదే ఫైల్ నేమ్ తో ర్యాప్ ద్వారా వీడియోను సెండ్ చేయడం జరుగుతుంది. దయచేసి తప్పకుండా పరిశీలించగలరు అని మనవి.

బర్డ్స్ ఫెస్టివల్....... పై ప్రత్యేక కథనం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ఈ నెల 14, 15 న అటవీశాఖ అధికారులు పక్షుల ప్రేమికుల కోసం పక్షుల నడక పండగను జరపనున్నారు.

పక్షి ప్రేమికులు ఇప్పటికే వారి పేర్లను నమోదు చేసుకున్నారని జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు. ఈ పండుగను వీక్షించాలంటే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు రావాల్సిందే.......

జిల్లాలో దట్టమైన అడవులు, కొండలు ,గుట్టలు ,జలజల పారే సెలయేర్లు...... ప్రకృతి రమణీయతను కట్టిపడేసే అందాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం. వీటిలో విభిన్న రకాల పక్షి జాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇలాంటి అందాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడం, పక్షి ప్రేమికుల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించే ఆలోచనతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు.

జిల్లాలో పక్షి జాతులు వాటి అధ్యయనం కోసం ఈనెల 14, 15 తేదీ రోజులలో "బర్డ్ వాక్ ఫెస్టివల్" నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడి అడవుల్లో లో కొత్త కొత్త పక్షులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే 270 రకాల పక్షులను గుర్తించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. విభిన్న జాతులు కలిగిన వీటిని వీక్షించడం, ఆల్బమ్ గా రూపొందించడం, గ్రామస్తులకు అవగాహన కల్పించే  ఉద్దేశంతో 'బర్డ్ వాక్ ఫెస్టివల్" కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు 100 మంది వరకు పక్షి ప్రేమికులు, ఉత్సాహవంతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఈ నెల 14 ,15 తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు ,వీడియో చిత్రీకరణ, డాక్యుమెంటరీ తయారు చేస్తారు. సర్వే, పక్షుల విధానంపై అధ్యయనం చేస్తారు. గ్రామస్తులతో మమేకమై ప్రకృతి పట్ల ప్రేమ, అడవుల ప్రాధాన్యత ను వివరించే లా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాలు:-- కాగజ్ నగర్ మండలం లోని కోసిని, సిర్పూర్ (టి )మండలంలోని మాలిని గుట్టలు, బెజ్జూర్, పెంచికల్ పేట్ మండలాలలోని నందిగామ గుట్టలు, పాలారపు గుట్టలు, మొర్రిగూడ ప్రాణహిత తీరం, తిర్యాని మండలం లోని గుండాల, ఆసిఫాబాద్ మండలంలోని కొమురం భీం జలాశయం ప్రాంతాల్లో"బర్డ్ వాక్ ఫెస్టివల్" నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.

బైట్:-- రంజిత్ నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_11_birds_festival_pkg_ts10078_HD

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.