ETV Bharat / state

ఆసిఫాబాద్​ జిల్లాలో ఇంట్లోకి ఎలుగుబంటి...

కుమురం భీం జిల్లా వైగం గ్రామస్థులను ఎలుగుబంటి హడలెత్తించింది. ఓ ఇంట్లోకి ప్రవేశించి భయపెట్టింది. ఇంటి ప్రాంగణంలో మృగాన్ని చూసిన ఇంటి యజమానులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామస్థుల సహాయంతో సమీప పొలాల్లోకి తరిమేశారు.

ఆసిఫాబాద్​ జిల్లాలో ఇంట్లోకి ఎలుగుబంటి...
author img

By

Published : Apr 14, 2019, 11:53 PM IST

కుమురం భీం జిల్లా కౌటాల మండలం వైగం గ్రామంలో ఓ ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. ఉదయాన్నే సమీప అడవుల్లోంచి గ్రామంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటి పనుల్లో నిమగ్నమైన యజమానులు మృగం రాకను గమనించలేదు. సుమారు ఉదయం 8 గంటల సమయంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న ఎలుగు బంటిని చూసిన వారు హడలెత్తిపోయారు. వెంటనే గ్రామస్థుల సహాయంతో.. అరగంటపాటు శ్రమించి సమీప పొలాల్లోకి తరిమేశారు. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆసిఫాబాద్​ జిల్లాలో ఇంట్లోకి ఎలుగుబంటి...
ఇవీ చూడండి: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

Intro:JK_TG_KRN_102_14_ADUGANTUTHUNNA_BHUGARBA JALALU_ENDUTHUNNA VARI POLALU_PKG_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, సైదాపూర్, చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మండలాలలోని భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో బోర్లు, బావులలో నీటి లభ్యత లేక సాగునీరు అందక వందల ఎకరాలలో వరి పంటలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. ప్రస్తుత రబీ సీజన్లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులు కొన్ని వందల ఎకరాల్లో వరి సాగు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఇక్కడ రైతులు బోర్లు, బావుల పై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువ కురిసాయి.రబీ సీజన్లో రైతులు వరి నాటు వేసేముందు బోర్లు, బావులలో నీరు పంటకు సరిపోయే విధంగా ఉందని వరినాట్లు వేశారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది ఒకవైపు ఎండలు మండు తుండడంతో ఉన్న కొద్దిపాటి నీరు బావులలో బోర్లలో అడుగంటి వరి పంటకు అందకుండా పోయింది. పంట చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతుంటే రైతులు దిగాలుతో చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేక పోతున్నారు. ఇంకో 15, 20 రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో సాగునీరు లేక ఎండిపోతుండడంతో రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఎకరానికి 25 వేల నుండి 30 వేల పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతుండడంతో ఏం ఏం చేసేది లేక కొంతమంది రైతులు గొర్రెలను మేపుతున్నారు, కొంతమంది రైతులు పశువులను మేపుతున్నారు, కొంతమంది రైతులు అప్పులు చేసి బోర్లు వేయించిన ఫలితం లేక అప్పుల పాలయ్యారు. ఎన్నో ఆశలతో వరి నాట్లు వేసిన రైతుల ఆశలు మరి కొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే సందర్భంలో అడియాశలయ్యాయి. ప్రభుత్వం సేద్యానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న బోర్లు బావులలో నీటి లభ్యత తగ్గిపోవడంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన అన్నదాతలకు కన్నీరే మిగులుతోంది. నష్టపోయిన రైతులు ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Body:బైట్స్

1) గొర్రెల కాపరి
2) మట్టెల కనకయ్య రైతు
3) కాశబోయిన కొమురయ్య రైతు
4) సుంకరి రామచంద్రారెడ్డి రైతు
5) కాశబోయిన నాగభూషణం రైతు
6) చింతల రవీందర్ రైతు

Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు నీటి లభ్యత లేక ఎండుతున్న వరి పొలాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.