భూ ప్రక్షాళనతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ పట్టణంలో పలుచోట్ల పీపుల్స్‌వార్ పేరిట బ్యానర్లు వెలిశాయి. పట్టణంలోని రైల్వే పై వంతెన, బస్టాండ్ ఏరియాలో ఏర్పాటు చేసిన బ్యానర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుత విధానంలో.. కాస్తూదారుని కాలమ్ లేకపోవడం వల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు భూ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల పోడుభూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని హెచ్చించారు. కాగా.. బ్యానర్ల ఏర్పాటుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: బాల్యాన్ని బడిలోనే చిదిమేస్తున్న కీచకోపాధ్యాయుడు