ETV Bharat / state

'జై జంగో జై లింగో' దీక్ష విరమించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు - telangana news

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జనవరి 14న తీసుకున్న 'జై జంగో జై లింగో' దీక్షను ఇవాళ పూర్తి చేశారు. ఒక పూట భోజనం చేస్తూ.. సాయంత్రం పాలు, పండ్లను తీసుకోవడం ఈ దీక్ష ప్రత్యేకత. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న రాయితాడ్ జంగోబాయి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకుని దీక్ష పూర్తి అయినట్లు పేర్కొన్నారు.

asifabad mla athram sakku finished his jai jango jai lingo initiation for one month
నెల రోజుల 'జై జంగో జై లింగో' దీక్ష విరమించిన ఎమ్మెల్యే
author img

By

Published : Feb 13, 2021, 10:36 PM IST

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జనవరి 14న తీసుకున్న 'జై జంగో జై లింగో' దీక్షను నేడు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివాసీలు నెల రోజుల నుంచి ఈ దీక్షను చేస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే కూడా దీక్షకు పూనుకున్నారు. జనవరి 14 నుంచి ఈ రోజు వరకు కొనసాగించారు.

ఈ దీక్షలో ఒక పూట భోజనం చేస్తూ.. సాయంత్రం పాలు, పండ్లను తీసుకుంటారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని.. అనుకున్న పనులు జరుగుతాయని వారి నమ్మకం. నేడు చివరి రోజు కావడం వల్ల ఆసిఫాబాద్​లోని రవిచంద్ర కాలనీలో ఉన్న పహాడ్​కూపర్ లింగో ఆలయానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు సతీసమేతంగా వెళ్లారు.

అనంతరం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో అటవీ ప్రాంతంలో ఉన్న పరందోలి గ్రామ పరిధిలోని రాయితాడ్ జంగోబాయి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడంతో తీసుకున్న దీక్ష పూర్తి అయినట్లు పేర్కొన్నారు.

అటవీ ప్రాంతంలో ఏర్పడిన ఈ ఆలయం ఒక గుహలా ఉంటుంది. గుహలో దీపం ఉంటుంది. ఆ దీపాన్ని 'జై జంగో జై లింగో' దేవునిగా కొలుస్తారు. దీపాన్ని చూసిన అనంతరం దీక్ష పూర్తి అయినట్లుగా భావిస్తారు.

ఇదీ చూడండి: పోరాట యోధుడిగా, పాలకుడిగా.. కేసీఆర్​ 'ఒక్కగానొక్కడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.