పెళ్లికానీ యువతులు తమకు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయనే నమ్మకంతో తీజ్ పండుగను జరుపుకుంటారు. చేనులోని మట్టిని వెదురుతో అల్లిన బుట్టలో వేసి అందులో గోధుమలు అలికి వాటికి సాంప్రదాయబద్ధంగా అలంకరణ వస్తువులు కట్టారు. ఆ బుట్టకు ఉదయం సాయంత్రం నిత్యం పూజలు, ఉపవాస దీక్షలతో ప్రదక్షణలు చేశారు. ఆ మొక్కలు ఎదిగిన విధంగా ఇల్లు అభివృద్ధి చెంది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, గ్రామం సుఖశాంతులతో ఉంటుందనే నమ్మకంతో మహిళలు పూజలు నిర్వహించారు. ముందుగా సేవాలాల్ భక్తులు ఆలయంలో హోమం నిర్వహించారు. అనంతరం ఆట పాటలు.. నృత్యాలతో నిమజ్జనానికి వందలాది మంది మహిళలు బయలుదేరారు.
ఇదీ చూడండి : మొక్కల పెంపకం నిర్లక్ష్యం చేయోద్దు