కుమురంభీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీ నగర్లో ఒక ఇంట్లో మద్యం కల్తీ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ మద్యాన్ని స్వాధీనపర్చుకున్నారు. మద్యంతో పాటు కల్తీ చేయడానికి వినియోగించే రసాయనాలు కూడా స్వాధీనపర్చుకున్నట్లు సమాచారం.
ఈ తనిఖీల్లో 576 (180 ఎంఎల్) మద్యం సీసాలు, 4 నీళ్ల డబ్బాలు, స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన సాయి కృష్ణ, చింటూ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు.
ఇవీ చూడండి: సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్.. అల్లర్లు