ETV Bharat / state

ఆర్​ఆర్​ఆర్​ చిత్రంపై ఆదివాసీల ఆగ్రహం.. వెల్లువెత్తిన నిరసనలు - Komurambheem NEws

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్​ఆర్​ఆర్​పై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మధ్యకాలంలో విడుదల చేసిన ఆర్​ఆర్​ఆర్​ భీమ్​ ట్రైలర్​లో కొమురం భీం పాత్రను ముస్లింలా చూపించడం పట్ల ఆదివాసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాలు తొలగించి.. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

aadivasi organisations protest against ss rajamouli
ఆర్​ఆర్​ఆర్​ చిత్రంపై ఆదివాసీల ఆగ్రహం.. వెల్లువెత్తిన నిరసనలు
author img

By

Published : Oct 24, 2020, 9:00 PM IST

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​ఆర్​ఆర్​ చిత్రంపై కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చిత్రంలో కొమురం భీం పాత్రను ముస్లింగా చూపించడం పట్ల ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆదివాసీల పోరాట యోధున్ని ముస్లింలా మార్చి.. తమ మనోభావాలు దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు.

చిత్ర దర్శకుడు రాజమౌళికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొమురంభీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో కొమురం భీమ్​ను కించపరిచేలా చూపిస్తే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవరావు హెచ్చరించారు.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే..: మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.