కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మద్యం సేవించిన ఓ వ్యక్తి ఎండ తీవ్రతకు తాళలేక మృతి చెందాడు. పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన కీర్తి వెంకటేశ్... దర్జీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటేశ్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
కొన్ని రోజులుగా కుటుంబ కలహాల కారణంగా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. ఈరోజు అతిగా మద్యం సేవించి రోడ్డుపక్కన పడిపోయాడు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడే ప్రాణాలొదిలాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి విచారణ చేపట్టారు.